ఎన్నికల ప్రచారం అంటే అధికార పార్టీ, ప్రతి పక్షాలు అధికారంలోకి వస్తే వారు చేయనున్న పనులను గురించి ప్రజల్లోకి వెళ్లాలి దాంతో ప్రజల మనస్సులు గెలుచుకోవాలి..కాని గత కొంత కాలంగా రాజకీయల పార్టీల ప్రచారం శైలిలో చాలా మార్పులు వచ్చాయి..అసలు సమస్యలు తప్పిదారి పట్టించి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారు నేతలు..ముఖ్యంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించే సమస్యలను ఎన్నికల అస్త్రాలుగా వాడుకుంటున్నాయి పార్టీలు..ప్రజల మధ్య మత,కుల ఘర్షణలు పెట్టడంపైనే పార్టీలు ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
తెలంగాణలో మినీ ఎన్నికల సందడి మొదలైంది..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో ఎన్నికల నామినేషన్లకు గుడువు దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది..ప్రధాన పార్టీలు పోటా పోటీగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా బీజేపీ- టీఆర్‌ఎస్ పార్టీల మధ్య రాజకీయ వేడి మరింత ముదిరింది..రెండు పార్టీల నేతల మధ్య మాటాలు తూటాలు పేలుతున్నాయి.. గురువారం రోజు బీజేపీ-టీఆర్‌ఎస్ పోటా పోటీగా మీడియా సమావేశాలు నిర్వహించాయి.. ఈ సమావేశంలో లోకల్ ముఖ్యంగా హైదరాబాద్ సమస్యల కంటే జాతీయ సమస్యలపై ప్రధానంగా చర్చకు వచ్చాయి.. గ్రేటర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలుపై కాకుండా ఉగ్రవాదం, టెర్రరిజం, మతం, కులం వంటి అంశాలను తెరపైకి తెచ్చారు గులాబీ మరియు కమలం పార్టీలు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ మీట్ ది ప్రెస్‌లో పాల్గొని.. గత ఏడు సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మీడియా ముందు ఉంచారు..గ్రేటర్‌లో పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా పనులు జరగలేది.. పనుల విషయంలో జాప్యం జరినట్లు చెప్పుకొచ్చారు కేటీఆర్.. ఇంకా అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గ్రేటర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీదే అన్నారు.. ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో పొత్తులు లేవని స్పష్టం చేశారు.. వరద సాయం బీజేపీ వల్లే నిలిచిపోయిందన్నారు.. గ్రేటర్ వరదకు కేంద్రం సహయం అందించలేదిని విమర్శించారు.. తెలంగాణపై మోడీ వివక్ష చూపిస్తున్నారని.. కర్నాటక,గుజరాత్‌కు వెంటనే నిధులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవేశారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండిసంజయ్ పత్రిక సమావేశం నిర్వహించారు.. బీజేపీ సంజయ్ మాట్లాడుతూ.. చైనా, పాకిస్థాన్ , సైనికులు,దేహ ద్రోహం, హిందూవులు ,ముస్లింలు, పౌరసత్వం, మగతం వంటి అంశాలను ప్రస్తావను తెచ్చారు.. మరో అడుగు ముందుకేసి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆలేరు ఎన్‌కౌంటర్‌ను మళ్లీ తెరపైకి తెచ్చాడు బండి సంజయ్.. ఆ ఎన్‌కౌంటర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీఆర్ఎస్ ప్రభుత్వంకు చేతగాకపోతేనే.. కేంద్రంలో అధికారంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్‌కౌంటర్ చేయించిందన్నారు.. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏకంగా సీఎం కేసీఆర్‌నే దేశ ద్రోహి అంటూ కామెంట్ చేశారు..
ఎంఐఎంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.. ఈ వ్యాఖ్యలు బీజేపీకి మంచి చేయడం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయంటున్నారు విశ్లేషకులు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.. బీజేపీని, మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాన వారందరికి ఉగ్రవాదులుతో సంబంధాలు అంటకట్టడంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.. గ్రేటర్ ప్రజలకు కావాల్పింది మొగతం, మొగాడు వంటి పౌరుష పదజాలం కాదని.. ప్రజలకు మీరు చేయాల్సిన పనులు,ప్రజలకు ఏలాంటి మంచి పనులు చేస్తారో చెప్పండంటున్నారు గ్రేటర్ వాసులు.
గ్రేటర్ పీఠం బీజేపీకి ఇస్తే LRS ఫీజులను రద్దు చేస్తామని ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఒక నగరపాలక సంస్థ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చే ధైర్యం చేస్తుందా? రాజ్యంగంలో అందుకు అవకాశం ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయశంగా మారింది.. మరోవైపు గ్రేటర్ మోటారు వెహికల్ చట్టాలను మారుస్తామని.. చాలన్స్ కేవలం మతం ఆధారంగానే వేస్తున్నారని.. మేము అధికారంలో వస్తే చాలన్స్ అన్ని గ్రేటర్ నిధులను నుంచే కడుతామని చెప్పారు.. ఇది ఏలా సాధ్యం అవుతుంది అంటున్నారు రాజంగ్య నిపుణులు.. మోటారు వెహికల్ చట్టం కేంద్రం తీసుకువచ్చింది దాన్ని మార్చడం నగర పాలక సంస్థకు సాధ్యం అవుతుందా అంటున్నారు.. గ్రేటర్ వాహనదారులను చట్టాలను అతిక్రమించండి మేము చాలన్స్ కడుతాం అని పరోక్షంగా సలహాలు ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు..క్రైమ్‌ను కంట్రోల్ చేయాల్సిన పార్టీలు నేరాన్ని ప్రొత్సహించడం ఎందని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో నగర సమస్యలు, డ్రైనేజీ, వాటర్, కరెంట్, నివాసం, శాంతి భద్రతలు,నగర పరిశుభ్రత గురించి మాట్లాడితే బాగుంటుందని.. ఉగ్రవాదం, టెర్రరిజం, దేశ రాజకీయలు గ్రేటర్ వాసులకు ఇప్పుడు అవసరం లేదని నగర ప్రజలు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు.. దేశ సమస్యలు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది కాని..ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు జాతీయ సమస్యలతో ముడిపెట్టవద్దని.. ఒక వేళ అపెట్టితే నగర ప్రజల సమస్యలను పార్టీలు తప్పుదోవ పట్టించడానికే చేస్తున్న రాజకీయాలని అంటున్నారు విశ్లేషకులు.