14 ఏళ్ల కుర్రాడికి వణిపోతున్న పట్టణం…మూడేళ్లపాటు నగర బహిష్కరణ

-

ఓ ఊరు ఊరంతా.. 14 ఏళ్ల బాలుడికి వణికిపోతుంది. ఆ బాలుడు వీధుల్లో కనిపిస్తే చాలు.. ఇంట్లోంచి బయటకు రావడం లేదు. అసలు ఎందుకు జనాలు ఆ పిల్లాడికి భయపడుతున్నారు..? పోలీసులు సైతం ఆ బాలుడిని ఊర్లోకి రాకుండా నిషేధించారు. అసలు మ్యాటరేంటో చూద్దామా..!
వయసు 14 ఏళ్లే కానీ.. వాడు మాములు బాలుడు కాదు.. వాడి పేరు కిల్యాన్ ఎవాన్స్. యూకేలోని కిడ్డెర్‌మిన్‌స్టర్‌లో గల వోర్సెస్టర్‌షైర్ పట్టణంలో ఉంటాడు. అతడి ప్రవర్తన చూసి ఆ పట్టణ ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.. అతడు అసాంఘిక పనులకు పాల్పడుతున్నాడని, తమని చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆ ఊరి ప్రజలంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు చాలా సార్లు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చారు..పిల్లాడే కదా అని పోలీసు ఫస్ట్‌ లైట్‌ తీసుకున్నారు.
ఆ బాలుడు ‘నా పేరు శివ’ సినిమాలో టీనేజర్ల టైపు. అతడిని అలాగే వదిలేస్తే తమ ప్రాణాలకే ప్రమాదమని ఆ పట్టణ ప్రజలంతా పోలీసులకు మొరపెట్టుకున్నారు. అతడు స్థానిక వ్యాపారులను, ప్రజలను భయపెట్డం మానుకోలేదు. డబ్బులివ్వాలంటూ వాళ్లను బెదిరించేవాడు. ఆన్‌లైన్‌లో కూడా చాలా మందిని పలు రకాలుగా వేధించాడు. దీంతో ఆ టీనేజర్‌పై చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెస్ట్ మెర్సియా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు కూడా చేశారు. యూకేలోని కోర్టు అతడిపై ‘క్రిమినల్ బిహేవియర్ ఆర్డర్ (CBO)’ను అమలు చేశారు. ఈ ఆదేశాల ప్రకారం.. ఆ బాలుడు ఇక ఆ పట్టణంలో కనిపించకూడదు. 2025 మే నెల వరకు ఈ అతడు ఆ ఊరిలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని కోర్టు తీర్పు ఇచ్చింది.. అలాగే అతడు బహిరం ప్రదేశాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి కనిపించకూడదు. ఒక వేళ రూల్స్ తప్పితే.. భారీ జరిమానా లేదా కఠిన కారాగార శిక్ష విధించే అవకాశాలున్నాయట.. యూకేలో ఇలాంటి ఆదేశాలను అమలు చేయడం చాలా అరుదు. అయితే, వేరే మార్గం లేకపోవడంతో ఆ బాలుడిపై ఈ నిషేదాన్ని విధించాల్సి వచ్చిందట..

Read more RELATED
Recommended to you

Exit mobile version