తెలంగాణ‌లో కొత్త‌గా 1473 కరోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజే కొత్త‌గా 1473 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది. మొత్తం 471 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మొత్తం 12,955 మంది చికిత్స తీసుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఆదివారం కొత్త‌గా 506 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్త‌గా 168 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 111 కేసులు న‌మోద‌య్యాయి. ఆదివారం ఒక్క రోజే 774 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీంతో మొత్తం రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 42,106కు చేరుకుంది.

ఆదివారం సాయంత్రం వ‌ర‌కు మొత్తం 9,817 శాంపిళ్ల‌ను ప‌రీక్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 3,63,242 శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. ఇక రాష్ట్రంలో పాజిటీవిటీ రేటు 15 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version