14వరోజుకు చేరుకున్న ఆర్టీసీ స‌మ్మె.. రేపటి బంద్ కు పెరుగుతోన్న మద్ధతు

-

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కాసేపట్లో సమావేశం కానుంది. సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో జేఏసీ నేతలు చర్చించనున్నారు. సమావేశంలో రేపు నిర్వహించే బంద్ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై జేఏసీ నాయకులు చర్చ జరపనున్నారు. ఇప్పటికే అన్ని వర్గాలు బంద్‌కు సహరిస్తామంటూ ప్రకటించాయని జేఏసీ తెలిపింది.

ఇక సమ్మెలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. రాణిగంజ్ బస్ డిపో వద్ద మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొనున్నారు. అలాగే ఇవాళ బస్ భవన్ ముట్టడికి అడ్వకేట్ జేఏసీ పిలుపునిచ్చింది. ఇక మరోవైపు ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆరా తీశారు. అదే విధంగా, సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగివస్తుందో, లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news