నేటి నుంచి దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే తొలి రోజు టీకా తీసుకోవడానికి వ్యాక్సిన్ కేంద్రానికి పోటేత్తారు. దేశంలో అన్ని రాష్ట్రాలల్లో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న వారి నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు అన్ని రాష్ట్రాలల్లో కలిపి 37,84,212 లక్షల మంది 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకున్నారు.
తర్వాత రోజులల్లో ఈ సంఖ్య కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగ దేశంలో కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో 15 నుంచి 18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదీల ఉండగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా నేటి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు వ్యాక్సినేషన్ కేంద్రాలలో పిల్లలతో మాట్లాడారు. పిల్లల స్నేహితులను కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చెప్పాలని సూచించారు.