15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

-

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల యువ‌తి య‌వ‌కులు ముందుకు వ‌స్తున్నారు. దీంతో చాలా త‌క్కువ స‌మ‌యంలో దేశంలో 50 శాతానికి పైగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారికి వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయా తెలిపారు.

కేంద్ర మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయా త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. కొవిడ్ – 19 కి వ్య‌తిరేకంగా మ‌న దేశం చేస్తున్న పోరాటంలో ఇది చాలా గొప్ప రోజు అని ఆయ‌న అన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారు 50 శాతానికి మించి మొద‌టి డోసు ను తీసుకున్నార‌ని తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు యువ‌తి యువ‌కులు క‌రోనా వ్యాక్సిన్ ప‌ట్ల ఉన్న ఉత్స‌హం భార‌త దేశ ప్ర‌జ‌ల అంద‌రికీ స్ఫూర్తిని ఇస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశంలో ఉన్న వారంద‌రూ కరోనా నియంత్ర‌ణ కు టీకాలు తీసుకోవాల‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version