ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 730 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670 తో పాటు దేవాదాయ శాఖలోని 60 ఈవో ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ కు అప్లే చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడువు ను పెంచింది. ఈ నెల 19 కి ఈ నోటిఫికేషన్ కు అప్లికేషన్ కు గడువు ఉండేది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో ఈ నెల 29 వరకు ఈ నోటిఫికేషన్ కు అప్లే చేయడానికి అవకాశం ఉండనుంది. అలాగే ఈ నెల 28 వరకు ఈ ఉద్యోగాలకు అప్లే చేసేందుకు ఫీజు చెల్లించాల్సి ఉండనుంది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని, అందరూ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది.