జాతియ రహదారులపై టోలో చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఫాస్టాగ్. వేగంగా చెల్లింపులు చేయడమే కాకుండా దీని ద్వారా ఎంతో సమయం కూడా ఆదా అవుతూ వస్తుంది. ఇక కచ్చితత్వం కూడా దీని ద్వారా పెరిగింది. అటు వాహనదారులు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనేక మొబైల్ వాలెట్లు ఆఫర్లు కూడా ఇవ్వడంతో క్రమంగా దీని వాడకం పెరిగిందనే చెప్పుకేవచ్చు.
ఇక ఇదిలా కేంద్రప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌లను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు చెందిన టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వద్ద ఈనెల 15 నుంచి 29 వరకు ఉచితంగానే వాహనదారులు పొందవచ్చని పేర్కొంది.
రూ.100 రుసుమును వసూలు చేయబోమని కేంద్ర రవాణా, రహదారుల శాఖ స్పష్టం చేసింది. అయితే ఫాస్టాగ్ వ్యాలెట్‌కు వర్తించే సెక్యూరిటీ డిపాజిట్ సహా కనీస బ్యాలెన్స్ విధానంలో ఏ మార్పులు ఉండబోవని పూర్తి వివరాల కోసం మై ఫాస్టాగ్ యాప్, ఫాస్టాగ్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చెయ్యాలని సూచించింది. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.