ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇర‌కాటంలో ప‌డుతున్న ఉద్యోగులు..!

-

ఇప్పటి వరకు కాంట్రాక్టుల్లోనే ‘రివర్స్‌’ అ స్త్రం ప్రయోగించిన వైసీపీ ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల జీతాల పెంపుపైనా ఆ అస్త్రాన్ని ప్రయోగించింది. మహిళ, శిశుసంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై రివర్స్‌ అస్త్రం విసిరింది. ఈ పథకం కింద కింద రాష్ట్రంలో పనిచేస్తున్న 305 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టై మ్‌ స్కేల్‌ అమలులో భాగంగా గత టీడీపీ ప్రభు త్వం వేతనాలు పెంచింది. వీరిలో రాష్ట్రస్థాయిలో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ నుంచి చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, నర్సు, ఆయా, వాచ్‌మన్‌ వరకు వివిధ కేటగిరీల్లో ఉన్నారు. వారి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.3- రూ.7 వేల వరకు జీతాలు పెరిగాయి.

వీరిలో ఆయాలకు వేతనాలు పెరగక ముందు రూ.6 వేలు ఉంటే, ఎంటీఎస్‌ అమలు తరువాత రూ.13 వేలు అయ్యింది. అంటే ఏడు వేలు పెరిగింది. అలాగే జిల్లా బాలల సం రక్షణ అధికారికి రూ.5,120, సంరక్షణ అధికారికి రూ.6,440, సోషల్‌ వర్కర్‌కు రూ.4,400, నర్సుకు రూ.6,460 చొప్పున వేతనాలు పెరిగాయి. అయితే ఇప్పటి వరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలంటూ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news