తెలంగాణ రాష్ట్రంలో నేడు కొత్త‌గా 156 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి రోజు రోజుకు త‌గ్గుముఖం ప‌డుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19,947 క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ పరీక్షల ఫ‌లితాలు ప్ర‌కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 156 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 7,88,931 క‌రోనా కేసులు వెలుగు చూశాయి.

కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. అలాగే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 99.10 శాతంగా ఉంటుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 425 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 2,968 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ థ‌ర్డ్ వేవ్ రాష్ట్రంలో దాదాపు పూర్తి గా త‌గ్గుముఖం ప‌ట్టింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డలించింది. కానీ క‌రోనా నిబంధ‌న‌ల‌ను మాత్రం పాటించాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news