17 ఏళ్ల అమ్మాయి… రౌడీతో ప్రేమాయణం… చివరికి…!

-

ప్రస్తుత సమాజంలో వస్తున్న సినిమాలు యువతీ యువకులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతమంది సినిమాలు చూస్తూ దొంగతనాలు చేస్తుంటే. మరికొంతమంది సరికొత్త నేరాలు ఎలా చేయచ్చో నేర్చుకుంటున్నారు. అయితే కొన్ని మెసేజ్ ఓరియెంటడ్ సినిమాలు చూసే ప్రేక్షకులు అందులో మంచిని తీసుకుని సమాజ హితానికి పాటుపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చెన్నైకి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి సినిమాల ప్రభావంతో ఏకంగా ఓ రౌడీ ని ప్రేమించింది. రౌడీ ని ప్రేమించావ్ అది తప్పు అని చెప్పిన పోలీసులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది..వివరాలలోకి వెళ్తే…

చెన్నై తిరువ్వేడ్కారు కి చెందిన 17 ఏళ్ళ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ రౌడీ షీటర్ ని ప్రేమించింది. అది తప్పని వారించిన తండ్రి ఎన్నో సార్లు మండలిచాడు. అయితే తండ్రి మాట పట్టని యువతి అతడితో ప్రేమాయణం సాగించడంతో తండ్రి పోలీసులని ఆశ్రయించాడు. అయితే చెన్నైలో మహిళల భద్రతా కోసం ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన “అమ్మ నిఘా” కి ఈ కేసుని అప్పగించారు. దాంతో రంగంలోకి దిగిన అమ్మ నిఘా వాహనం సదరు యువతికి కౌన్సిలింగ్ ఇవ్వాలని వెళ్ళింది.

అయితే ఆమెకి నచ్చజెప్పే క్రమంలో రౌడీ లని ప్రేమించడం తప్పు అది నీకు ఎంతో చెడ్డ పేరు తీసుకువస్తుంది. నీ భవిష్యత్తుకి మంచిది కాదని చెప్పారు. దాంతో ఒళ్ళు మండిన యువతి సినిమాలలో హీరోయిన్ ఎలా రౌడీని మార్చుకుంటుందో అలానే నేను మార్చుకోగలను మీరు చెప్పక్కలేదు అంటూ బదులు ఇచ్చింది. సినిమాలలో ఉన్నది తప్పు అంటే అలాంటి సినిమాలు ఎందుకు మీరు ఆపడంలేదు అని షాకింగ్ ప్రశ్న వేసింది. ఏమి చెప్పాలో తెలియక ఎలాగోలా ఆమెకి నచ్చజెప్పి మొత్తానికి ఆమె చేసిన తప్పుని తెలిసేలా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news