వావ్.. 2.730 మిల్లీ గ్రాముల గోల్డ్ తో.. రామ మందిరం నమూనా..!

-

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన ఒక సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభ చూపిస్తూ అందరి ప్రశంసలని పొందుతున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు స్వర్ణకారుడు అయినటు వంటి కపిలవాయి గోపి చారి ప్రతివంతం ప్రతిభ తో అదరగొట్టేసాడు అందరినీ ఆకట్టుకున్నాడు. అయోధ్య రాముల వారి విగ్రహం ప్రతిష్ట సందర్భంగా భవ్య మందిర నిర్మాణం నమూనాని బంగారంతో చేసాడు ఇతను.

అద్భుతంగా తయారుచేసిన ఈ కళాఖండాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలా దీనిని తయారు చేయడానికి 2.370 మిల్లీ గ్రాముల బంగారం పట్టింది రామ మందిర నిర్మాణం నమూనాని తయారు చేసాడు ఇతను. ఇప్పుడే కాదు గతం లో కూడా అనేక సూక్ష్మ పరికరాలని తయారు చేశాడు ప్రభుత్వం కనుక సహకరించిందంటే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news