వాణిజ్య‌ప‌రంగా వినియోగంలోకి వ‌చ్చిన డాక్ట‌ర్ రెడ్డీస్ 2-డిజి మెడిసిన్

-

హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ లిమిటెడ్ సంస్థ 2-డిఆక్సీ-డి-గ్లూకోజ్ (2-డిజి మెడిసిన్ ) ఔష‌ధాన్ని సోమవారం వాణిజ్య‌ప‌రంగా విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దేశంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు హాస్పిట‌ల్స్ కు ఆ సంస్థ రూ.990 ఒక సాచెట్ చొప్పున ఈ ఔష‌ధాన్ని పంపిణీ చేయ‌నుంది.

డాక్ట‌ర్ రెడ్డీస్ | 2-డిజి మెడిసిన్

2డిజి పేరిట డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థ త‌యారు చేసిన ఈ ఔష‌ధం 99.5 శాతం స్వ‌చ్ఛ‌త‌ను క‌లిగి ఉంటుంది. దీన్ని 2డిజి బ్రాండ్ నేమ్ కింద విక్ర‌యిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా డాక్ట‌ర్ రెడ్డీస్ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ మ‌ధ్య‌స్థ‌, తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ఈ మెడిసిన్‌ను వాడ‌వ‌చ్చ‌ని తెలిపారు. డీఆర్‌డీవో భాగ‌స్వామ్యంతో ఈ మెడిసిన్‌ను త‌యారు చేస్తుండ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. కోవిడ్‌ను అడ్డుకునేందుకు సాగిస్తున్న పోరాటంలో తాము భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు.

కాగా టైర్ 1 సిటీల్లో ముందుగా ఈ మెడిసిన్ అందుబాటులోకి రానుంది. త‌రువాత ఇత‌ర న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లోనూ ఈ మెడిసిన్‌ను అందుబాటులో ఉంచుతారు. ఈ మెడిసిన్ ఒక్కో సాచెట్ ధ‌ర రూ.990 ఉంటుంది. ప్ర‌భుత్వ స‌బ్సిడీ ఇచ్చాకే ఈ ధ‌ర‌కు ఈ మెడిసిన్ ల‌భిస్తుంది. ఈ మెడిసిన్‌ను వాడ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త తగ్గుతుంది. దీంతో అత్య‌వ‌స‌ర చికిత్స‌ను అందించే ప్ర‌మాదం త‌ప్పుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news