ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. సిలిండర్ పేలుడు వల్ల మంటలు సంభవించాయని అనుమానిస్తున్నారు. 20 మంది దాకా గాయపడ్డారని తాజా సమాచారం. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మరణించినట్టు ధాఖలాలు లేవు. రెండు అగ్నిమాపక దళాలు దళం, రెండు జంబో ట్యాంకర్లను అక్కడికక్కడే ఉంచినట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.
లాల్‌బాగ్‌లోని గణేష్ గల్లీ వద్ద నాలుగు అంతస్థుల సారాభాయ్ భవనం యొక్క రెండవ అంతస్తులో ఈ పేలుడు సంభవించినట్టు చెబుతున్నారు. గాయపడిన వారిలో 12 మందిని కెఇఎంకు పంపారు. గత నెల మొదట్లో కూడా, తమిళనాడులో సిలిండర్ పేలుడు సంభవించడంతో తరువాత గోడ కూలి ఎనిమిది సంవత్సరాల బాలుడు మరియు అతని తల్లితో సహా ముగ్గురు మరణించారు మరియు నలుగురు గాయపడ్డారు.