బాలికపై లైంగిక దాడి..నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష వేసిన ఖమ్మం కోర్టు

-

బాలికపై లైంగిక దాడి యత్నం చేసిన కేసులోనిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఖమ్మం సెకండ్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్ కోర్టు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదికి ఒక కూతురు, కుమారుడున్నారు. వారిద్దరూ మైనర్లు కాగా.. ఆమె రోజు కూలి పనులకు పోతూ ఉండేది.

ఈ నేపథ్యంలోనే. 2020 జూలై 25 వ తేదీన తన పిల్లలలను ఇంటి వద్ద ఉంచి కూలి పనికి వెళ్లింది. ఈ క్రమంలో…అదే గ్రామానికి చెందిన బోల్లె పోగు వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలికకు పుట్నాలు పెడతానని చెప్పి తన ఇంటికి తీసుకు వెళ్లి.. తలుపులు వేసి బాలికపై అత్యాచారం యత్నం చేయబోయాడు. దీన్ని గమనించిన స్థానికులు అతనికి దేహ శుద్ది చేశారు.

దీంతో అక్కడి నుంచి పరార్‌ అయ్యాడు. ఇక ఈ ఘటనపై బోనకల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది ఆ బాలిక తల్లి. దీనిపై కోర్టు లో చార్జీషీట్‌ దాఖలు చేయగా ఆ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితునిపై నేరం రుజువు కావడంతో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పును మహ్మాద్‌ అప్రోజ్‌ అక్తర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version