బిజినెస్ ఐడియా: ఇలా కోళ్ల ఫారం తో నెలకు రూ.20 వేలు పొందండి..!

-

మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నార..? ఆ వ్యాపారంతో మంచిగా రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. పైగా ఈ బిజినెస్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మీరు మీ ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. ఈ వ్యాపారం ద్వారా నెలకు 10 వేల నుంచి 20 వేల వరకు కూడా పొందొచ్చు. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

చాలా మంది డబ్బులు కోసం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించదు. అయితే మీరు ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా మంచిగా రాబడి పొందొచ్చు. ఈ కోళ్ళని కనుక పెంచితే మంచి ఆదాయం వస్తుంది. గుడ్లు పెట్టగలిగే 120 కోళ్లను పెరట్లో మీరు పెంచితే అద్భుతమైన రాబడి వస్తుంది. త్రీ టైర్ కే సిస్టం ద్వారా 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న స్థలం అవసరమవుతుంది. మూడు అంతస్తుల పంజరాన్ని మీరు ఏర్పాటుచేసుకోవాలి.

దీని పొడవు 7.5 అడుగులు వెడల్పు, ఏడు అడుగులు ఎత్తు ఉంటుంది. దీనికి ఒక వైపు మూడు కానాలు, రెండో వైపు మూడు కానాలు కోళ్ల కోసం ఏర్పాటు చేయాలి. 20 లీటర్ల ఫైబర్ ట్యాంకర్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మీరు ప్రతిరోజు దీన్ని నింపితే సరిపోతుంది. 18 నుండి తొమ్మిది వారాల వయస్సు నుండి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది.

ఆ వయసులో ఉన్న 120 కోళ్లని పెంచుకుంటే సుమారు సంవత్సరం కాలం గుడ్లు పెడతాయి. ఆ కోళ్ళని మీరు అమ్మేసి మళ్లీ గుడ్లు పెట్టే వయసున్న కోళ్ళని కొనుక్కొని పంజరంలో పెంచొచ్చు. ఆహారం వేయడం నీళ్లు అందించడం చాలా అవసరం. అలానే సాయంత్రం దాన వేయాలి. రాత్రి లైట్ లు తీసేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా కోళ్ల వ్యాపారం చేసుకోవచ్చు. మీరు ఈ గుడ్లని ఇంట్లోనే స్వయంగా అమ్ముకోవచ్చు. ఇలా నెలకు మీరు 20 వేల వరకు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news