18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు రూ.1000 : కేజ్రీవాల్‌ కీలక ప్రకటన

-

మరో నెల రోజుల్లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే గోవాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక తాజా ఆమ్‌ ఆద్మీ అధినేత, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. గోవాలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ పార్టీ మ్యానిఫెస్టో ను విడుదల చేశారు కేజ్రీవాల్‌.

ఈ మేనిఫెస్టో ప్రకారం… 18 ఏళ్లు పైబడిన గోవాలోని ప్రతి మహిళకు రూ.1000 ఇస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం కేజ్రీవాల్‌. అలాగే… అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గోవాలో 24×7 ఉచిత విద్యుత్ సౌకర్యంతో పాటు మంచి నీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోవాలోని రోడ్లను మరమ్మత్తులు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన, ఉచిత నిర్భంధ విద్య అందిస్తామని ప్రకటించారు. కాగా.. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news