BREAKING : ఐసీయూలోనే ల‌తా మంగేష్క‌ర్.. హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

ప్రముఖు గాయని లతా మంగేష్కర్‌ వారం రోజుల కిందట కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్‌ రావడంతో… సరిగ్గా వారం రోజుల కిందట ఆమెను ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్‌ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటూ ఆమె కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు.

అయితే.. తాజాగా బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి ఆస్పత్రి వైద్యులు ఆమె హెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేశారు. ” ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణ లోనే ఆమె ఉన్నారు. మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఏం చెప్పినా కానీ అది తొందరపాటే అవుతుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆమె ఆస్పత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది” అని వైద్యులు ప్రతీత్‌ సందాని హెల్త్‌ బులిటెన్‌ ద్వారా ప్రకటించారు.