2000 రద్దు లేదంట.. కేంద్రమంత్రి చెప్పారు నమ్మండి ప్లీజ్‌..!

-

సరిగ్గా నాలుగేళ్ల క్రిత్రం పెద్ద నోట్ల రద్దంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. అవినీతికి అడ్డుకట్ట వేయడానికే నంటూ చెప్పుకొచ్చింది. ఎవరి దగ్గర ఎంత దొరికిందీ.. ఆ అవినీతిపరులెవరో తేల్చిందీ లేదు.. మరి ఏం సాధించారు సారూ అంటే మనకు తెలుసిందే సమాధానం..

చెమటోడ్చి సంపాదించి అరటి పళ్లు అమ్ముకునే తోపుడు బండి అన్న డబ్బులు, పెన్షడబ్బులు జమచేసుకునే అవ్వ తాతల పైసలు, బిక్షాటన చేసి పోగేసుకున్న రొక్కం చెల్లకుండా పోయాయే తప్ప ఒరిగిందేంటో, ఆఆఆ పెద్ద తలకాయలెవరో తెలిసింది లేదు.. 5 వందలకే చిల్లర దొరకని సమయంలో 2000వేల నోటు అంటకట్టేశారు. అంత పెద్ద నోటు పేదోడికి ఎందుకు.. పెద్దోడికే కావాలి.. లక్షల రూపాయలను చిన్న పాకెట్లో పెట్టుకునేందుకు పనికి వచ్చిందా పెద్ద నోటు.. అంతేగా..

ఉన్నట్టుండి ఇప్పుడేమో 2000 నోటు రద్దు చేస్తారంటూ ఓ ప్రచారం సోషల్‌ మీడియాలో ఓ ఊపు ఊపేస్తుంది.. చిన్నోడికి చిల్లర దొరక్క ఏం చేయాలో దిక్కుతోచక అయోమయంలో ఉంటే…కిరాణా షాపు సేటు గారేమో అసలు ఆ నోటు వెళ్ళడం లేదు ఎక్కడైనా మార్చుకొమ్మంటున్నారు.. ఈ రోజు చేతిలో ఉన్న 2000 నోటుని మార్చుకోవడానికి ఏదో చేసి వదిలించుకుంటున్న తాత, మామ్మలు రేపు మళ్లీ వచ్చి చేరే ఆ పెద్ద నోటును మార్చుకోవడం కోసం ఎన్ని తిప్పలు పడాలో…

మరి నిజానికి ఈ పెద్ద నోటు రద్దు అవుతుందా లేదా అనేది తేలని విషయం.. కేంద్రమంత్రి గారేమో రద్దు వార్తను ఖడించారు.. అయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ ప్రచారం ఆగడం లేదు. ఈ సోషల్‌ మీడియా ఉంది చూశారూ.. పనికొచ్చే మంచి మాటల్ని మెల్లిగా.. పనికిరాని వాటిని ఫాస్ట్‌గా తీసుకుపోతుంది. ఆ రోజుల నుండి నేటి నవీన కాలం వరకు మంచి ఎప్పుడు వెల్లిగానే నడుస్తుంది ఏంటో.. ఇందుమూలంగా యావత్‌మంది ప్రజలకు తెలియజేయడమేమనగా పెద్ద నోట్ల రద్దు ఇప్పట్లో లేదన్నది కేంద్రమంత్రి మాట మరి. నమ్మండయ్య… లేదు నమ్మమం మోడీనే చెప్పాలంటారా..?? కేంద్రమంత్రి చెప్పారుగా… నమ్మండి ప్లీజ్‌..

Read more RELATED
Recommended to you

Exit mobile version