వయస్సు 22 ఏళ్ళు.. క్యాన్సర్ తో పోరాడి ఇప్పుడు 50 కోట్ల వ్యాపారాన్ని చేస్తోంది..!

-

కొందరు సమయాన్ని వృధా చేసుకుంటూ చిన్న చిన్న పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారు. అలానే అస్సలు కష్ట పడరు కూడా. ఇలాంటి వారు వారి యొక్క గోల్ ని అస్సలు రీచ్ ఇవ్వలేరు. నిజానికి మనం ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే సంకల్పం అత్యంత కీలకం. అలానే సక్సెస్ పై ఆశ, కోరిక తో పాటుగా కృషి, శ్రమ కూడా ఉండాలి. నిజానికి పట్టు వదలకుండా కష్ట పడితే విజయం తథ్యం.

 

ఈమె కూడా అలాంటి వారే. ఈమె ఒక సాధారణ మార్వాడి కుటుంబంలో పుట్టారు. ఈమె పేరు కనికా టేక్రివాల్. క్యాన్సర్ ని జయించి అనుకున్నది సాధిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 500 మిలియన్ రూపాయల విలువైన సంస్థను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈమె లండన్ లో ఎంబీఏ పూర్తి చేశారు.

చదువుకుంటున్న రోజుల్లోనే బిజినెస్ ని మొదలు పెట్టారు. ఎప్పుడూ కూడా ఈమె మంచిగా ఆలోచించేవారు. విజయం సాధించి ఆదర్శంగా నిలవాలని ఈమె అహర్నిశలు శ్రమించే వారు. ఈమె వయసు చిన్నదైనా సరే ఎంతో బాగా కష్టపడి మంచి పొజిషన్ కి చేరుకున్నారు. కనిక టేక్రివాల్ క్యాన్సర్ నుండి కోలుకుంటోందని వైద్యులు ఏ మాత్రం అనుకోలేదు. ఆమె సంకల్ప బలానికి క్యాన్సర్ కూడా ఓడిపోయింది.

అయితే క్యాన్సర్ నుండి కోలుకున్నాక ఢిల్లీ వెళ్లాలని అనుకున్నప్పటికీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దీంతో వాళ్ల దగ్గరే ఉంటూ బిజినెస్ కి కావలసిన జ్ఞానాన్ని ఆమె సంపాదించుకున్నారు. ఆ తర్వాత జెట్స్ గో ఏవియేషన్ సర్వీసెస్ పేరుతో మొదలుపెట్టారు. అయితే ఇలాంటి సర్వీసెస్ ని స్థాపించడం గొప్ప విషయమనే చెప్పాలి.

కనిక 500 మిలియన్ రూపాయల విలువైన ప్రైవేట్ హెలికాఫ్టర్ నిర్వహణ మరియు చార్టర్ సేవలు మొదలుపెట్టారు. దీనిని ‘ఉబర్ ఆఫ్ ది స్కైస్’ అని అంటారు 150మంది వాణిజ్య విమాన ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నారు. వయస్సు చిన్నదైనా సరే ఈమె 50 కోట్ల వ్యాపారంని నడిపించడం చూస్తూ ఉంటే మెచ్చుకుని తీరాలి.

Read more RELATED
Recommended to you

Latest news