తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై చిత్త శుద్ధి లేదని తెలంగాణ జన సమితి రాష్ట అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. నేడు మెదక్ పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం.. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చేరిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. సమస్యలపై ప్రశ్నించే నాయకులను కేసీఆర్ ప్రభుత్వం జైల్లో పెడుతుందని మండిపడ్డారు.
అలగే మల్లన్న సాగర్ నిర్వాసితులు న్యాయం చేయాలని అడిగినందకు.. పోలీసులు కొట్టారని అన్నారు. అలాగే ఆయా గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం చిత్త శుద్ది లేదని విమర్శించారు. అలాగే గతంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని అడిగితే.. నిరుద్యోగులను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే.. ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.