ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నాటి నుంచి కరోనా కేసుల సంఖ్యలో భారీగ మార్పులు వచ్చాయి. గతంలో ప్రతి రోజు పది వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండగా.. ప్రస్తుతం ప్రతి రోజు 500 కన్న తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజా గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,735 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దీనిలో కేవలం 220 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగు చూశాయి. అలాగే రాష్ట్రంలో ఇద్దరు కరోనా మహమ్మారి కాటుకు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య.. 14,720 కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 472 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 4,927 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.