బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ కోట్లు సంపాదించడంతో పాటు సమాజాన్ని బ్రష్టు పట్టిస్తూ, సామాన్యుల చావులకు కారణమైన వారిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారి నుంచి అమాయకులను రక్షించేందుకు తనవంతు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన పోస్టులతో పలువురు ఇన్ఫ్లూయెన్సర్ల మీద పోలీసులు కేసులు పెట్టారు.
తాజాగా ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మరో ట్వీట్ చేశారు. ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.
ఓ ఛానల్‌లో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారన్నారు. తను చేస్తున్నదే తప్పు..అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ ‘X’లో పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే సర్వస్వం అంటూ’ సజ్జనార్ ఫైర్ అయ్యారు.