224 చైనీస్ యాప్స్ బ్యాన్‌.. చైనాకు రూ.1.50 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం..!

-

భార‌త ప్ర‌భుత్వం చైనాకు చెందిన 224 యాప్స్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నిషేధించింది. గ‌తంలో రెండు సార్లు, ఇప్పుడు తాజాగా 118 యాప్స్.. మొత్తం క‌లిపి 224 యాప్స్ ను భార‌త్ బ్యాన్ చేసింది. అయితే ఈ యాప్స్ ను నిషేధించడం వ‌ల్ల చైనా భారీ ఎత్తున న‌ష్ట‌పోయింది. మొత్తం 200 మిలియ‌న్ డాలర్ల‌ (దాదాపుగా రూ.1,46,600 కోట్లు) న‌ష్టం చైనాకు సంభ‌వించింది. ఇక ఇందులో ప‌బ్‌జి వాటాయే అధికంగా ఉంది.

224 chinese apps ban china got rs 1.50 lakh crores loss

ప‌బ్‌జి గేమ్‌ను నిషేధించ‌డం వ‌ల్ల చైనాకు 100 మిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం ఏర్ప‌డింది. ఈ మేర‌కు కౌంట‌ర్ పాయింట్ రీసెర్చి అనే సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కాగా ప‌బ్‌జి గేమ్ డెవ‌ల‌ప‌ర్లు భార‌త్ నుంచి ఏటా 80 నుంచి 100 మిలియ‌న్ల డాల‌ర్ల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ గేమ్‌ను నిషేధించ‌డంతో ఇప్పుడా ఆదాయాన్ని ఆ గేమ్ డెవ‌ల‌ప‌ర్లు కోల్పోనున్నారు.

కాగా ప‌బ్‌జి గేమ్‌కు నిజానికి భార‌త్ నుంచే పెద్ద ఎత్తున ఆదాయం వ‌స్తోంది. అయితే భార‌త్ లాంటి దేశాన్ని కోల్పోవ‌డం ఇప్పుడా గేమ్ డెవ‌ల‌ప‌ర్ల‌కు అత్యంత మింగు ప‌డ‌ని విష‌యంగా మారింది. కాగా అమెరికా, జ‌పాన్‌, చైనా, సౌత్ కొరియాల‌తో పోలిస్తే నిజానికి మ‌న దేశంలో గేమింగ్ రంగం నుంచి కంపెనీల‌కు వ‌చ్చే ఆదాయ‌మే ఎక్కువ‌. భార‌త్‌లో మొత్తం 300 మిలియ‌న్ల మంది ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారు ఉన్నారు. వారిలో 85 శాతం మంది మొబైల్స్ లో గేమ్స్ ఆడేవారే కావ‌డం విశేషం. అందులోనూ ప‌బ్‌జి గేమ్‌ను ఆడేవారు ఎక్కువ‌గా ఉన్నారు. అయితే ప‌బ్‌జిని బ్యాన్ చేయ‌డంతో ఓ వైపు గేమింగ్ ప్రియులు తీవ్ర‌మైన నిరాశ‌లో ఉండ‌గా, మ‌రోవైపు ఆయా కంపెనీల‌కు భారీ ఎత్తున న‌ష్టం క‌ల‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news