ఏపీలో రీ ఇన్ఫెక్షన్ కేసులు లేవని అధికారులు ప్రకటించి కొన్ని రోజులు కూడా కాలేదు ఒక రీ ఇన్ఫెక్షన్ కేసు నమోదయింది. అది కూడా టీటీడీలో కావడం మరింత టెన్షన్ కలిగిస్తోంది. టీటీడీ భద్రతా విభాగానికి చెందిన ఓ ఉద్యోగికి రెండోసారి కరోనా సోకింది. ఈ ఉద్యోగి శ్రీవారి ఆలయంలోనే భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయనకు గతంలో జూన్ 27న కొవిడ్ నిర్ధారణ అయింది.
ఆ సమయంలో ఎటువంటి సింప్టమ్స్ లేనప్పటికీ టెస్ట్ లో పాజిటివ్ అని రావడంతో ఆయన క్వారెంటైన్ కు వెళ్లారు. ఇక ప్రస్తుతం మళ్ళీ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సమయంలో జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకోవడంతో మళ్లీ పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స నిమిత్తం శ్రీనివాసం కొవిడ్ సెంటర్ కు తరలించారు. రెండవ సారి తోటి ఉద్యోగికి పాజిటివ్ రావడంతో భయాందోళనలో ఉద్యోగులు ఉన్నారు. అయితే ఏపీలో ఇదే తొలి రీ ఇన్ఫెక్షన్ కేసు కావడంతో వైద్య అధికారులు ఈయన్ని ప్రత్యేక వార్డ్ కి తరలించే అవకాశం ఉంది.