గత కొన్ని రోజులుగా సుడాన్ ఆర్మీ, పారామిలటరీ దళం మధ్య భీకర పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే…అంతర్గత యుద్ధం వల్ల సుడాన్లో చిక్కుకున్న భారతీయులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. దీంతో సుడాన్ నుంచి రెండో బ్యాచ్‌గా మరో 246 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానంలో ముంబై చేరుకున్నారు. పరస్పర దాడుల్లో సుమారు 500 మంది పౌరులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించి సురక్షితంగా భారత్‌కు చేర్చేందుకు ‘ఆపరేషన్ కావేరి’ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కాగా, తొలుత సుడాన్ నుంచి వందలాది మంది భారతీయులను యుద్ధ నౌకల ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి భారత వాయుసేనకు చెందిన భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ ద్వారా గురువారం ముంబైకి తీసుకొచ్చారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆపరేషన్ కావేరీ మిషన్‌లో భాగంగా రెండో బ్యాచ్ కింద మరో 246 మంది భారతీయులు మరో విమానంలో దేశానికి తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సుడాన్ నుంచి రక్షించిన 360 మంది భారతీయులతో కూడిన తొలి బ్యాచ్ మరో విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకుంది. మరోవైపు, సుడాన్ నుంచి భారతీయల తరలింపులో ఇండియన్ నేవీ కూడా ఎంతో శ్రమిస్తున్నది. భారత నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ టెగ్ గురువారం 297 మంది భారతీయులను సుడాన్ పోర్ట్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించింది. 278 మంది భారతీయులతో కూడిన తొలి బ్యాచ్ ఐఎన్ఎస్ సుమేధ ద్వారా బుధవారం జెడ్డాకు తరలించారు. అనంతరం వీరందరినీ జెడ్డా నుంచి రెండు విమానాల్లో భారత్‌కు చేర్చారు. భారత యుద్ధ నౌకల ద్వారా జెడ్డాకు చేరిన భారతీయుల రెండో బ్యాచ్ ఇది.
చేర్చారు.
Another #OperationKaveri flight comes to Mumbai.
246 more Indians come back to the motherland. pic.twitter.com/So7dlKO0z6
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 27, 2023
#OperationKaveri continues in swift pace.
Happy to receive 297 Indians at Jeddah carried by INS Teg. With this second ship and total six batches, around 1100 Indians rescued from Sudan have arrived in Jeddah.
Repatriation to India of those arriving today will commence shortly. pic.twitter.com/krTteb121h
— V. Muraleedharan (@MOS_MEA) April 27, 2023