MlC కవిత ఇంటి ముట్టడి కేసులో 26 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలు 26 మంది పై కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. ఇప్పటికే అరెస్ట్ అయిన కార్యకర్తలు పై మూడు సార్లు సెక్షన్ల లను మార్చారు. నిన్న సాయంత్రం 341, 148, 353, 509 , 149 కింద వారిపై కేసులు చేశారు. మధ్యరాత్రి వైద్య పరీక్షలు కోసం గాంధీ ఆస్పత్రికి తరలించిన సమయంలో ఐపీసీ 307 కింద కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు… ఈరోజు ఉదయం మూడో సారి సెక్షన్ల లను మార్చి 307 ను తొలగించారు.
చివరిగా 341, 147, 148, 353 332, 509, రెడ్ విత్ 149 కింద కేసులు చేశారు. అయితే.. రాజకీయ ఒత్తిళ్లు వలన ఇప్పటికే మూడు సార్లు సెక్షన్ల మార్చారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక దీనిపై బంజారాహిల్స్ సీఐ నరేందర్ మాట్లాడుతూ.. MLC కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై FiR నమోదు చేశామమని.. 26 మంది ని అరెస్ట్ చేశాము, ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వీరిపై 341, 147, 148, 353,332, 509, రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేశామని.. నిందితులను వర్చువల్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామన్నారు.