రాచకొండ పరిధిలో 27మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీలు.. కారణం అదేనా?

-

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల స్థాయిలో బదిలీలు జరిగాయి. మొత్తం 27 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ బదిలీల్లో ఎలాంటి పైరవీలకు అస్కారం లేకుండా..కేవలం సిబ్బంది పనితీరు ఆధారంగా పోస్టింగ్స్ ఇచ్చినట్లుగా పోలీస్‌వర్గాలు వెల్లడించాయి.

అయితే, బదిలీ అయిన 27 మంది ఇన్‌స్పెక్టర్లు మంగళవారం ఆయా స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఇంత పెద్దమొత్తంలో సీఐ స్థాయి అధికారులు బదిలీ అవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు, డ్రగ్స్ వినియోగం జోరుగా సాగుతోంది.స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులకు స్థానచలనం కల్పించారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news