119 నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో 2,898 మంది

-

తెలంగాణలోనామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. పరిశీలన ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు మిగిలారు. 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం జరిగిన స్క్రూటినీలో 608 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇవాళ కూడా పలు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. వడపోత అనంతరం ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి 114 మంది బరిలో నిలిచారు. మేడ్చల్ నుంచి 67, కామారెడ్డిలో 58, ఎల్బీ నగర్‌లో 50 మంది, కొడంగల్‌లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణపేట నుంచి ఏడుగురు మాత్రమే బరిలో నిలిచారు.

కేసీఆర్ పోటీ చేస్తున్న మరో సెగ్మెంట్ కామారెడ్డిలో ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ 64 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తిరస్కరణల అనంతరం 58 మంది బరిలో నిలిచారు. మరో కీలక నియోజకవర్గం సిరిసిల్ల.. ఇక్కడి నుంచి మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ 23 మంది నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ దాఖలైన అన్ని నామినేషన్లను ఈసీ అంగీకరించింది. మంత్రి హరీశ్ రావు పోటీ చేస్తున్న సిద్దిపేటలో 38 నామినేషన్లు దాఖలు కాగా.. రెండు రిజెక్టయ్యాయి. ఇందులో 36 ఆమోదం పొందాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ లో మొత్తం 15 నామినేషన్లు దాఖలు కాగా.. ఒకటి రిజెక్టయ్యింది. దీంతో అక్కడ 14 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 23 నామినేషన్లు దాఖలవగా.. ఆరు రిజెక్టయ్యాయి. ఇందులో 17 మంది నామినేషన్లు ఓకే అయ్యాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version