2024 ఎన్నికలు: పవన్ 175 స్థానాల్లో పోటీ చేస్తాడా ?

-

నిన్న రాత్రి భీమవరం లో జరిగిన సభలో అధికార పార్టీ మరియు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఇక నిన్నటి నుండి ఇప్పటికీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు మీటింగ్ లు పెట్టి సినెమాలలోలాగా భారీ డైలాగులు మాట్లాడడమే వచ్చు అంటూ సెటైర్ వేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఏ ఛాలెంజ్ కైనా మేము సిద్దంగానే ఉన్నాము. కానీ పవన్ కు మేమిచ్చే ఛాలెంజ్ లో నిలబడతాడా అంటూ కామెంట్ చేశాడు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో పవన్ పార్టీ జనసేన మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తాడా అంటూ ప్రశ్నించాడు. ఈ మీటింగ్ లకు జనాలు వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదని.. నువ్వు సినీ స్టార్ వి కాబట్టి అభిమానంతో మీటింగ్ లకు వస్తారు.

అంతే కానీ రాజకీయంగా నువ్వు సమర్ధువిడి అని కాదు అంటూ రాజకీయాలలో నీ పప్పులు ఇక్కడ ఉడకవు అని పరోక్షముగానే మార్గాన్ని భరత్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version