పిల్లలు, మహిళల కోసం 3 పథకాలు… వివరాలివే..!

-

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం అన్నారు. అయితే మహిళల అభివృద్ధి కోసం మరియు పిల్లల కోసం మూడు పథకాల్ని తీసుకు వస్తున్నట్టు కేంద్రం చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇప్పటికే మిషన్ పోషణ్, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను మొదలు పెట్టినట్టు చెప్పింది కేంద్రం. అయితే ఈ స్కీమ్స్ ని మహిళల ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకు వచ్చింది అని అంది.

అయితే ఈ పథకాల వలన కలిగే లాభం ఏమిటి అనేది చూస్తే.. వీటి వలన మహిళల మేధో, సామాజిక, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందని తెలియజేసారు. ఇది ఇలా ఉండగా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రెండు లక్షల అంగన్ వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

తమ ప్రభుత్వం పిల్లల ఆరోగ్యానికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. అప్ గ్రేడ్ అయిన అంగన్ వాడీలు పిల్లల అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు. అలానే మిషన్ శక్తి పథకాన్ని విజయవంతం చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి వర్క్ చేస్తుందని అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని మహిళా శక్తి ప్రాముఖ్యతను గుర్తిస్తూ తీసుకు వచ్చినట్టు పేర్కొన్నారు. దీని వలన చాలా మంది మహిళల జీవితం లోకి వెలుగు వస్తుందని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version