వంటింట్లో వుండే ఈ పదార్ధాలని ఉపయోగిస్తే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది..!

-

ఆయుర్వేద గుణాలు ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. మన ఇంట్లో ఉంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆహారపదార్థాల్లో హీలింగ్ గుణాలు ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అయితే వంటింట్లో ఉండే ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అలానే ఇబ్బందులు కూడా ఉండవు. మరి వంటింట్లో ఉండే ఈ ఆహార పదార్థాల వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు చూద్దాం.

అల్లం:

అల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అజీర్తి సమస్యలను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అల్లాన్ని కొంచెం నిమ్మరసంలో నానబెట్టి అందులో ఉప్పు వేసి భోజనం తర్వాత తీసుకుంటే అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. జలుబు, సైనస్ వంటి సమస్యలు కూడా ఉండవు.

దాల్చిని:

దాల్చిని కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. జలుబుని కూడా ఇది తగ్గిస్తుంది.

జీలకర్ర:

జీలకర్ర లో యాంటీ ఇంఫ్లమ్మెటరీ గుణాలు ఉంటాయి. జీర్ణ సమస్య ని కూడా తొలగిస్తుంది.

ధనియాలు:

ధనియాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలను కూడా తొలగిస్తాయి. బ్లోటింగ్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు.

ఇంగువ:

ఇంగువ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది అలాగే ఇది బ్లోటింగ్, కడుపు నొప్పి వంటి సమస్యలని కూడా తొలగిస్తుంది. కనుక దీనిని కూడా రెగ్యులర్ గా వాడుతూ ఉండండి.

పసుపు:

పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలానే మోకాళ్ల నొప్పులు వంటి వాటి నుంచి కూడా బయట పడేస్తుంది.

యాలుకలు:

యాలుకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇలా ఈ లాభాలను మన వంటింట్లో ఉండే ఆహార పదార్థాలతో పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version