ఎమ్మెల్యేలు, జర్నలిస్టులకు కేసీఆర్ గుడ్ న్యూస్..వచ్చే నెలలోనే ఇండ్ల స్థలాలు

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌…కేంద్ర ప్రభుత్వం పెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ పై ప్రెస్‌ మీట్‌ పెట్టి.. బీజేపీపై నిప్పులు చెరిగారు. అయితే… ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, అలాగే జర్నలిస్టులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త కూడా చెప్పారు. త్వరలోనే… ఎమ్మెల్యేలు, అలాగే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటన చేశారు.

ఈ ఇండ్ల స్థలాల వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని.. మరో నెల రోజుల్లోనే.. ఈ పంచాయితీ తెగుతుందని చెప్పారు. అనంతరమే.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని మీడియా ముందు ప్రకటన చేశారు. దీనిపై ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు. అయితే… ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు కేసీఆర్‌ శుభవార్త కూడా చెప్పారు. త్వరలోనే… 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. 317 జీవోతో… నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కావాలనే కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version