ఎట్టకేలకు యాంకర్ ప్రదీప్ సినిమాకి విడుదల తేదీ దొరికింది..

యాంకర్ ప్రదీప్ హీరోగా చేస్తున్న మొదటి చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా.. గత ఏడాది వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా అన్ని సినిమాలా లాగే వాయిదా పడింది. ఐతే ప్రస్తుతం 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకి రిలీజ్ డేట్ దొరికింది. సంక్రాంతి సందర్భంగా ఇప్పుడిప్పుడే థియేటర్లకి కొత్త సందడి వస్తుంది. ఇప్పటి వరకూ ఆగిపోయిన సినిమాలన్నీ థియేటర్ల బాట పడుతున్నాయి. 30రోజుల్లోప్రేమించడం ఎలా సినిమా జనవరి 29వ తేదీన విడుదల అవుతుందని చిత్రబృందం ప్రకటించింది.

ఈ సినిమా నుండి విడుదలైన నీలి నీలి ఆకాశం ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. హీరోగా చేస్తున్న మొదటి సినిమా పాటకి ఈ రేంజిలో హైప్ రావడం ప్రదీప్ కి మంచి కలిసొచ్చే పరిణామం. అమృత అయ్యర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాని మున్నా దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా హిట్ అయ్యి, టాలీవుడ్ లో హీరోగా ప్రదీప్ నిలబడతాడా అన్నది చూడాలి.