ఐదో టెస్ట్ రద్దుతో రూ.304 కోట్ల నష్టం !

భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ వేదిక గా జరుగుతున్న ఈ ఐదో టెస్టు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆట ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యం లో ఐదో టెస్టు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇక ఈ టెస్ట్ మ్యాచ్ రద్దుకు ఇరుజట్లు అంగీకారం తెలపడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లంకా షైర్ క్రికెట్కు మరియు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీ లో వందల కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు మరియు ఇతర మార్గాల ద్వారా ఏకంగా 30 మిలియన్ పౌండ్లు అంటే రూ. 304 కోట్లూ వరకు నష్టం వాటిల్లిందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు ఓ అధికారి స్పష్టం చేశారు.