ఐఏఎఫ్‌లో 317 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

ఫ్లయింగ్ బ్రాంచ్, పర్మనెంట్ కమిషన్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్)‌ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా ఈ కోర్సుల్ని నిర్వహిస్తోంది. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ హైదరాబాద్‌ లోని దుండిగల్‌ లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీ లో ఈ కోర్సుల్ని నిర్వహిస్తుంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ లో 317 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1న మొదలు పెట్టనుంది.

అప్లై చేయడానికి డిసెంబర్ 30 చివరి తేదీ. 2021 డిసెంబర్ 1 ఉదయం 10 గంటలు నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్‌కు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్‌కు 52 వారాలు. ఇక అర్హత విషయంలో వస్తే.. అభ్యర్థులు 12వ తరగతి పాస్ కావాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌లో ఈ ఎగ్జామ్ పాస్ కావాలి.

రెండు సబ్జెక్ట్స్‌ లో కనీసం 50 శాతం చొప్పున మార్కులు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. 2023 జనవరి 1 నాటికి ఫ్లై బ్రాంచ్ అభ్యర్థులకు 20 నుంచి 24 ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అభ్యర్థులకు 20 నుంచి 26 ఏళ్లు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

పూర్తి వివరాలను https://careerindianairforce.cdac.in లేదా https://afcat.cdac.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news