క్లారిటీగా కేసీఆర్..మమత ఫార్ములాతో?

-

తెలంగాణ సీఎం కేసీఆర్…వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఫాలో అవుతున్నారా? వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ విషయంలో మమత ఏ విధంగా వ్యూహాలు రచించారో అలాగే కేసీఆర్ కూడా ముందుకెళుతున్నారా? అంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసలు బీజేపీకి పెద్ద స్కోప్ లేదనే చెప్పాలి. ఏదో ఒకటి రెండు సీట్లు గెలుచుకునే సత్తా మాత్రమే ఉంది. కానీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత అనుసరించిన రాజకీయ వ్యూహాల వల్ల బెంగాల్‌లో బీజేపీ పికప్ అయింది. మమత వరుసగా అధికారంలో కొనసాగుతూ…బలంగా ఉన్న కమ్యూనిస్టులని, కాంగ్రెస్ పార్టీని తోక్కేసింది. దీంతో బీజేపీ పికప్ అయింది.

kcr
kcr

దీంతో ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో మమత వర్సెస్ బీజేపీ అన్నట్లు వార్ నడిచింది. అయితే ఇక్కడ బీజేపీని గెలవకుండా చేయడానికి..కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె గట్టిగా టార్గెట్ చేశారు. మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు వారి వల్ల బెంగాల్ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదంటూ… బీజేపీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు చెలరేగుతాయని..ఇలా అనేక రకాలుగా బీజేపీని టార్గెట్ చేశారు. ఫలితంగా మమత బెనర్జీకి మామూలు విజయం దక్కలేదు.

ఇప్పుడు అదే స్ట్రాటజీతో కేసీఆర్ వెళుతున్నట్లు కన్పిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్…టీడీపీ, కాంగ్రెస్‌లని అలాగే తోక్కేశారు. దీంతో బీజేపీ పికప్ అయింది. ఇక కాంగ్రెస్ కూడా లైన్‌లోకి వస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీని లైట్ తీసుకుని కేవలం బీజేపీని టార్గెట్ చేసి కేసీఆర్ రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం అసలు తెలంగాణకు అన్యాయం చేస్తుందనే కోణంలో ప్రచారం మొదలుపెట్టారు. ధాన్యం కొనుగోలు అంశంలో తెలంగాణ ప్రజల దృష్టిలో బీజేపీని పూర్తిగా విలన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా బీజేపీని టార్గెట్ చేయడం వల్ల రేసులో కాంగ్రెస్ వెనుకబడినట్లైంది.

అసలు రాష్ట్రంలో కేసీఆర్ వర్సెస్ బీజేపీ అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు అలా వార్ క్రియేట్ చేసింది కేసీఆర్. ఈ వార్‌లో బీజేపీని విలన్ చేసి…తాను మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ఫార్ములాతో కేసీఆర్ ఏ మేర సక్సెస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news