హైదరాబాద్ కి 35 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేల తరలింపు

-

జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్.. సీఎం రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపింది.జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి ఎఐసిసి పెద్దలు పలు సూచనలు చేశారు. ఎఐసిసి ఆదేశాలతో ఎమ్మెల్యేల క్యాంపు కోసం రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.ప్రత్యేక విమానం ద్వారా 35 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారు.

భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జేఎంఎం అధినేత హేమంత్ సొరెన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో ఆ పార్టీ శాసనసభపక్ష నేతగా ఉన్న చంపై సోరెన్ ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.అయితే ఎమ్మెల్యేలు చేజారకుండా, ప్రభుత్వం మారకుండా కాంగ్రెైస్ పార్టీ చర్యలు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news