మీరు ఉదోగం కోసం చూస్తున్నారా..? అయితే తప్పకుండ మీరు ఈ నోటిఫికేషన్ చూడాలి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ(Department of Medical and Health)లో 1,460 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టులను ఐదు రోజుల కింద రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం 3,977 పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
ఈ పోస్టుల ద్వారా నియామకమైన అభ్యర్థులు వచ్చే సంవత్సరం మార్చి 31 కొనసాగేలా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేయాలని సూచించింది. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోస్ మూడు వేర్వేరు ఉత్తర్వులను రిలీజ్ చేయడం జరిగింది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే…
దీనిలో మొత్తం 573 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. వరంగల్ కేఎంసీకి 57, ఎంజీఎంకు 27, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి 3, సీకేఎంకు 4 కేటాయించింది. అలానే
మిగతావి హైదరాబాద్ ఉస్మా నియా, గాంధీ, నిలో ఫర్, డెంటల్ ఆస్పత్రులతో పాటుగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్ది పేట తదితర జిల్లాలకు కేటాయించడం జరిగింది.
ఇది ఇలా ఉంటే అన్ని జిల్లాలకు 1,216 మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ (ఫిమేల్) / ఏఎన్‌ఎం పోస్టులు మంజూరు చేశారు. అలానే జీఓఆర్‌టీ నం.1040 ప్రకారం చూసుకుంటే 766 స్పెషల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, 115 సివిల్ సర్జన్ (జనరల్), 139 ల్యాబ్ టెక్నీషియన్, 119 ఫార్మసిస్టు, 252 ఏఎన్‌ఎం పోస్టులు.
జీఓఆర్‌టీ 1039 ద్వారా 264 సివిల్ సర్జన్ పోస్టులు. అదే విధంగా 86 ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్–2, 126 ఫార్మసిస్టు గ్రేడ్–2 పోస్టులు మంజూరు చేశారు. ఈ పోస్టులకి సంబంధించి వివరాలని త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.