తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలో 17ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నీట్ ఎగ్జామ్ రాసి వైద్య విభాగంలో చదువు కొనసాగించాలనుకున్న అమ్మాయి, ఆత్మ హత్య చేసుకున్నట్లు నమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగు రోజుల వ్యవధిలో నీట్ ఎగ్జామ్ పరీక్ష రాయాల్సిన వారు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరీక్షలో ఫెయిల్ అవుతామన్న భయంతో పాటు అమ్మానాన్న పెట్టుకున్న నమ్మకాలను నిజం చేయలేకపోతున్నామన్న ఆలోచనలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఐతే ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ నుండి తమిళనాడును మినహాయించాలని తమిళనాడు శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. నీట్ ప్రవేశపెట్టినప్పటి నుండి అంటే 2017నుండి ఇప్పటివరకు డజన్ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేసింది.