ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్”, కెజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సినిమా పరిశ్రమకు అందించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బాహుబలి తర్వాత హిట్ అంటే ఏమిటో తెలియని ప్రభాస్ కు బ్రేక్ ఇవ్వాలని చేస్తున్నాడు. ఇప్పటికే పార్ట్ 1 షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికి మూవీ యూనిట్ ప్రకటించిన రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 … కానీ ఈ డేట్ కు వస్తుందా లేదా అన్న అనుమానాలు ఇండస్ట్రీ లో ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ మారుతున్నట్లు అధికారిక సమాచారం లేకపోవడంతో కొన్ని సినిమాలు విడుదల పట్ల అనిశ్చితి నెలకొంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న పెదకాపు 1 సినిమాను సలార్ రిలీజ్ కాకపోతే సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇదే బాటలో రూల్స్ రంజన్, మ్యాడ్ మరియు రామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న స్కంద మూవీ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి సలార్ మూవీ ఈ సినిమాలకు రూట్ క్లియర్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.