భారీ ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదులను లేపేసిన ఇండియన్ ఆర్మీ

జమ్మూలోని నాగ్రోటాలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు అని గుర్తించిన నిఘా వర్గాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. చాలా గంటల పాటు ఈ కాల్పులు జరిగాయి.

ఇక జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని భద్రతా దళాలు మూసివేశాయి. ఈ ప్రాంతంలో ఇంకా 3-4 మంది ఉగ్రవాదులు ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. బాన్ టోల్ ప్లాజా సమీపంలో భద్రతా దళాలు పాగా వేసి… వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. ఈ సమయంలో ఉగ్రవాదుల బృందం బలగాలపై కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు అటవీ ప్రాంతం వైపు పారిపోగా వారి కోసం గాలించారు.