40వేల టార్గెట్స్.. 4,700టన్నెల్స్ మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు

-

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. మొన్నటివరకు పాలస్తీనా రెబల్స్‌ హమాస్‌తో పోరాటం చేసిన ఇజ్రాయెల్.. తాజాగా ఇరాన్‌లోని టెర్రరిస్టు ఆర్గనైజేషన్ హిజ్బుల్లాతో తలపడుతోంది. ఇటీవల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో ఇరాన్ రంగంలోకి దిగింది. తమ భూభాగంలో దాడులు చేసి నస్రల్లాను హతమార్చరని అందుకు ప్రతీకారంగా టెల్ అవీవ్‌పై బాంబు వర్షం కురిపించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలాఉండగా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి 40 వేల హమాస్ టార్గెట్స్, 4,700 టన్నెల్స్, 1000 రాకెట్ లాంచర్ సైట్లను బాంబులతో నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. 2023 అక్టోబర్ 7 నుంచి 726 మంది తమ సైనికులు మరణించారని పేర్కొంది. అదే రోజు 380 మంది మిలిటరీ ఆపరేషన్స్ మొదలయ్యాక మరణించినట్లు తెలిపింది. యుద్ధంలో 4576 మంది గాయపడ్డారని, 3 లక్షల మంది రిజర్వు సైనికులను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించింది.అందులో 82శాతం పురుషులు, 18శాతం మంది మహిళలు ఉన్నారని పేర్కొంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news