తెలంగాణలో మంత్రి కొండా సురేఖ-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తొలుత కొండా సురేఖ పై కొందరూ నెటిజన్స్ ట్రోలింగ్స్ చేస్తే.. దానిపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ కి చెందిన వారే కొందరూ తనపై ట్రోలింగ్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్-కొండా సురేఖ ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకున్నారు.
ఈ తరుణంలోనే మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అటు సినిమా ఇండస్ట్రీకి కూడా కాస్త బురద జల్లిందనే చెప్పాలి. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల హీరోయిన్ సమంతకు క్షమాపణ చెప్పి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ముఖ్యంగా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి.. మంత్రులపై టీపీసీసీ చీఫ్ సీరియస్ అయ్యారు. కొండా సురేఖ ఘటన తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మానిటరింగ్ పవర్‌లో ఉన్న టైంలో మంత్రులు ఆచితూచి మాట్లాడాలని.. ప్రతిపక్షాలు టెంప్ట్ చేసినా, నోరు జారవద్దని మంత్రులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.