420 బ్యాచ్‌కు ఎన్టీఆర్ పేరును ఉచ్చ‌రించే హ‌క్కు లేదు : టీడీపీపై మంత్రి కొడాలి నాని ఫైర్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జల ఆరాధ్య న‌టుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన పార్టీ పెట్టి 40 ఏళ్ళు అవుతుందని ఎన్టీఆర్ ఫోటోలు పెట్టి ప్రజలను టీడీపీ మోసం చేయాలనే ప్రయత్నం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని ఆయన చావుకు కారణం అయ్యింది ఎవ‌రు అని ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్ చావుకు ఈ వెన్నుపోటు బ్యాచ్ కార‌ణ‌మ‌ని అన్నారు. ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్ర‌శ్నించారు.

అలాంటి 420 బ్యాచ్ కు ఎన్టీఆర్ పేరును ఉచ్చ‌రించే నైతిక హ‌క్కులు కూడా లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ 420 బ్యాచ్ ఎన్టీఆర్ విగ్ర‌హానికి క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని వారికి తెలుస‌ని అన్నారు. అందుకే ఈ డ్రామాల‌కు తెర‌లేపార‌ని ఆరోపించారు. ఎన్టీఆర్ శాపం వల్లే లోకేష్.. మంగళగిరిలో ఓడిపోయాడని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులు చంద్ర‌బాబుపై పగ, ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news