ఇంటిని తగలబెట్టుకున్న ఓనర్.. అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

-

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయింది అని ఓ సామెత ఉంటుంది కదా..అలాగే జరిగింది ఇక్కడ. ఇంట్లో ఉన్న సమస్యకు పరిష్కారం అనుకుంటే ఏకంగా ఇళ్లే కాలిపోయింది. ఆ యజమానే చేతులారా ఇళ్లు తగలపెట్టుకున్నాడు. పాపం అతనికి అంత కష్టం ఏం వచ్చింది..అంత మంచి ఇళ్లును ఎందుకు తగలపెట్టుకున్నాడో చూద్దాం.

అమెరికాలోని మేరీలాండ్ లోని మాంటెగోమేరీ కౌంటీ. అక్కడ ఓ ఇంట్లోకి పాములు తరచుగా వస్తున్నాయట. ఇంట్లో పాములు వస్తున్నాయంటే ఎవరికైనా భయమేస్తుంది కదా.ఎలాగోలా వాటిని బయటకు పంపే మార్గాం చూస్తాం. పాములు పట్టే వాళ్లకు చెప్తే వాళ్లే చూసుకుంటారు. కానీ ఆ ఇంటి ఓనర్ పాముల్ని వదిలించుకోవడానికి ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు.

నిజానికి ఆ ఇంటి ఓనర్ ప్లాన్ చేసింది వేరు. జరిగింది వేరు..పాపం ఆ ఓనర్ పొగ వదిలితే… ఊపిరి ఆడక పాములు బయటకు పోతాయి అని అనుకున్నాడు. అందుకోసం రహస్యంగా బొగ్గులు తెచ్చాడు. వాటిని వెలిగించాడు. మంట వచ్చింది. ఊదాడు… పెద్దగా పొగ వచ్చింది. అతను చేసిన తప్పేంటంటే… ఇంట్లో మంటలు వచ్చేందుకు అవకాశం ఉన్న వస్తువుల దగ్గర ఈ బొగ్గులను వెలిగించాడు. దాంతో ఆ వస్తువులకు మంటలు అంటుకున్నాయి. అంతే.. ఒక్కసారిగా పెద్ద మంటలు వచ్చి… ఇల్లంతా అంటుకుంది.

ఎంత ప్రయత్నించినా మంటలు ఆగలేదు. దాంతో ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి కాల్ చేశాడు..చుట్టుపక్కల వాళ్లు కూడా కాల్ చేశారు. కానీ..అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఇల్లంతా కాలిపోయింది. చివరకు బంగారం లాంటి ఇల్లు బొగ్గులా తయారైంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఫైర్ సిబ్బంది… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ.. ఆస్తి నష్టం భారీగా జరిగింది. మొత్తం రూ.7.55 కోట్ల ఆస్తి కాలిపోయినట్లు తెలిసింది.

చిన్న పొరపాటుతో పాపం అతను ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఇలా తెలిసి తెలియక చాలామంది చేసే పనులు ఒక్కోసారి నష్టాన్ని మిగులుస్తాయి..కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తాయి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు మొత్తానికి ఆయన అనుకున్నదే చేశాడని కమెంట్ చేస్తున్నారు. మరికొంతమంది పాపం అంటూ నిట్టూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news