అమెరికాలో ఒక్క రోజే 4,500 మంది మరణించారు…!

-

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ సునామి కంటే అత్యంత భీకరంగా తయారు అయింది. ప్రతీ రోజు వేల కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే తాజా సమాచారం ప్రకారం 30 వేల కేసులు నమోదు అయ్యాయి. గురువారం రాత్రి 8:30 గంటల వరకు జాన్స్‌హాప్కిన్స్‌ యూనివర్శిటీ గణంకాల ప్రకారం చూస్తే మృతుల సంఖ్య 32,917కి చేరుకుంది. ఇందులో యువకులు వృద్దులు ఎక్కువగా ఉన్నారు.

ఇక అక్కడ గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,491 మంది కరోనా వైరస్ తీవ్రతకుప్రానాలు కోల్పోయారు. ప్రపంచంలో ఎప్పుడు కూడా కరోనా వైరస్ కి ఒక రోజు ఇంత మంది మరణించలేదు. అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,67,800కు చేరుకుంది. అక్కడ న్యూయార్క్ లో ఇప్పటి వరకు 12 వేల మంది కరోనా కారణంగా మరణించారు. అక్కడ ప్రజలు బయటకు రాకపోయినా సరే కేసులు పెరుగుతున్నాయి.

అమెరికా తర్వాత ఇటలీలో 22,170 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్పెయిన్ లో 19,130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ లో 17,920 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కేసులు ఇంకా రెండు మూడు వారాల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రతను కట్టడి చేయడం ఇప్పట్లో అమెరికాకు సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news