ఇప్పుడు జోలె ప‌ట్ట‌రా బాబూ..  సోష‌ల్ మీడియా స‌టైర్లు..!

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన‌గానే చాలా వెరైటీ రాజ‌కీయాలు చేసే నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చు కు న్నారు. త‌న అనుభ‌వంలో రాజ‌కీయాల‌ను ఆయ‌న కాచి ఒడ‌బోశారు. త‌న సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో రెం డు పార్టీల‌ను ఆయ‌న చ‌దివేశారు. ఒక పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్నారు. అనేక మంది నాయ‌కులను చూ శారు. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించారు. విభ‌జ‌నానంత‌ర ఏపీని ఐదేళ్లు పాలించారు. అలాంటి నాయ‌కు డు ఎక్క‌డ ఏ విష‌యంలో ఎలా రాజ‌కీయం చేయాలో ఆయ‌న‌కు తెలియ‌ద‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ, ఒక్కొక్క సారి ఆయ‌న వ్యూహాలు విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ.. ఆయ‌న సీనియార్టీని త‌ప్పుబ‌ట్టే నాయ‌కులు ఎ క్కడా లేరు.

ఇక‌, ఏ విష‌యాన్న‌యినా కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలోనూ చంద్ర‌బాబును మించిన నా య‌కుడు లేరనే విష‌యం గ‌త ఐదేళ్ల కాలంలో అంద‌రికీ తెలిసిందే. నిజానికి ప్ర‌తిప‌క్షానికి ఎదురు దెబ్బ త‌గిలిన స‌మ‌యంలోనూ త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇక‌, త‌న‌కు ఎదు రు దెబ్బ త‌గిలి, ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించిన‌ప్పుడు కూడా ఆయ‌న త‌న‌కు అనుకూలంగా చ‌క్రం తిప్పుకొ న్నారు.

అలాంటి నాయ‌కుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప‌రోక్షంగా అనేక చ‌క్రాలు అడ్డు వేస్తున్నారు. స‌రే!ఇది వేరే విష‌యం. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల రాజ‌ధాని విష‌యంపై తీవ్ర గంద‌ర‌గోళం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు.. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఉద్య‌మాల కోసం జోలె ప‌ట్టి విరాళాలు సేక రించారు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు కూడా ఎవ‌రికీ ఆ ఆలోచ‌న కూడా రాలేదు. చంద్ర‌బాబు జోలె ప‌ట్ట‌గానే అనేక మంది విరాళాలు ఇచ్చారు. మ‌రి ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్‌తో పేద‌ల అల్లాడుతుంటే.. ఈ జోలె ప‌ట్ట‌డం అనేవిష‌యం ఆయ‌న‌కు గుర్తు రాలేదా? అనేది సోష‌ల్ మీడియా సంధిస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

పోనీ.. క‌రోనా లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతోంది కాబ‌ట్టి.. నేను బ‌య‌ట‌కు రాలేను.. అని అంటే.. ఆన్‌లైన్‌లో అయినా రాజ‌ధాని ఇటుక‌ల‌కు డ‌బ్బులు సేక‌రించిన‌ట్టుగా క‌రోనా బాధితుల కోసం నిధులు సేక‌రించొచ్చుక‌దా?  మీ అనుభ‌వ సారాన్ని వినియోగించి నిధులు సేక‌రిస్తే.. పేద‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది క‌దా? అనేది వీరి మాట‌. మ‌రి బాబు స్పందిస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news