5.9 కిలోల బ‌రువుతో శిశువు జ‌న‌నం.. ఎక్క‌డంటే..?

-

సాధారణంగా నవజాత శిశువులు 2 నుంచి 3 కిలోల బరువుతో జన్మిస్తారు. కాని, బెంగళూరులో 5.9 కిలోల బ‌రువుతో మగశిశువు జ‌న్మించ‌డంతో డాక్ట‌ర్లు ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన యోగేశ్, సరస్వతి దంపతులు గత కొన్నేళ్లుగా బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సరస్వతికి నెలలు నిండడంతో ఇటీవల ఆసుపత్రికి వెళ్లగా వైద్యపరీక్షలు చేసి కవల పిల్లలు పుట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఆమె బరువు 80 కిలోలు ఉండడంతో వైద్యులు కవలలుగా భావించారు.

అయితే, ప్రసవం తర్వాత వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమెకు ఒక్క మగశిశువు మాత్రమే జన్మించాడు. అయితే అసాధారణ రీతిలో 5.9 కిలోలు బరువున్నాడు. యోగేశ్, సరస్వతి దంపతులకు ఇప్పటికే ఓ బిడ్డ ఉండగా, 14 ఏళ్ల తర్వాత ఇలా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. కాగా, అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన శిశువులు 3 కేజీలవరకు బరువు ఉంటారు. ఈ బాలభీముడు మాత్రం ఐదు కేజీలకు పైగా బరువు తూగి అందరినీ విస్మయానికి గురిచేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news