మాజీ సీఎం కేసీఆర్ పై బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని.. కేంద్రం ప్రభుత్వంలోని వివిధ సంస్తలు లెక్కలతో సహా మన అభివృద్ధిని అభినందిస్తూ అవార్డులు అందించాయని గుర్తు చేసారు.
కానీ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గ మొదటి సమావేశానికి వర్చువల్ గా హాజరైన వినోద్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు.